ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఏపీ శాసన సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నాట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపాడు
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నాట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు అన్సర్ ఇచ్చారు. మొత్తం 59 గంటలు 57 నిమిషాల పాటు సభ కొనసాగింది.
ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలకు బహిష్కరించింది. ఏపీ విద్యార్థులకు శుభవార్త. శాసనమండలిలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మెస్ చార్జీలకు బడ్జెట్ లో ఈ ఏడాదికి రూ.135 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం 2023 – 24 కి పెట్టిన బకాయి రూ. 50 కోట్లు మేం చెల్లించాం , మరో రూ. 54 కోట్లు డిసెంబర్ లో చెల్లిస్తామని పేర్కొన్నారు.
Advertisement