సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ!

సునీల్ కుమార్ నేత్రుత్వంలో సీఐడీ అధికారులు, అనేక మంది ప్రజలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, కస్టడీలో తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం శాఖకు గత అక్టోబర్ లో లేఖ రాశారు.

Advertisement
Update:2023-02-14 11:05 IST

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ నుండి ఈ రోజు లేఖ అందింది.

సునీల్ కుమార్ నేత్రుత్వంలో సీఐడీ అధికారులు, అనేక మంది ప్రజలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, కస్టడీలో తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం శాఖకు గత అక్టోబర్ లో లేఖ రాశారు. అందులో ఆయన ప్రజల ప్రాథమిక హక్కులకు సీఐడీ అధికారులు భంగం కలిగిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖను పరిశీలించిన కేంద్ర హోం శాఖ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కారదర్శిని ఆదేశిస్తూ లేఖ రాసింది. 

Tags:    
Advertisement

Similar News