పయ్యావులకు గన్‌మెన్ల తొలగింపు

ఏపీ పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను తొలగించింది. ఇది కక్షసాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం పయ్యావులకు 1+1 భద్రత ఉంది. ఇటీవలే తన భద్రతను పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్‌ లేఖ కూడా రాశారు. అయితే ఉన్న గన్‌మెన్లను కూడా ప్రభుత్వం వెనక్కు రప్పించింది. ఈ పరిణామంపై ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే భద్రతను వెనక్కు తీసుకున్నారని ఆరోపిస్తోంది. నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన […]

Advertisement
Update:2022-07-11 05:42 IST

ఏపీ పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను తొలగించింది. ఇది కక్షసాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం పయ్యావులకు 1+1 భద్రత ఉంది. ఇటీవలే తన భద్రతను పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్‌ లేఖ కూడా రాశారు. అయితే ఉన్న గన్‌మెన్లను కూడా ప్రభుత్వం వెనక్కు రప్పించింది.

ఈ పరిణామంపై ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే భద్రతను వెనక్కు తీసుకున్నారని ఆరోపిస్తోంది. నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన పయ్యావుల కేశవ్‌… ప్రభుత్వం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనా నిఘా పెట్టిందని ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు, సాక్షి ఉద్యోగులపైనా నిఘా పెట్టారని.. వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని పయ్యావుల సంచలన ఆరోపణలు చేశారు. కావాలంటే తాను చెబుతున్న అంశాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పయ్యావుల సవాల్ చేశారు.

ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం కక్ష సాధింపున‌కు దిగుతోందని.. అందులో భాగంగానే గన్‌మెన్లను తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News