హైదరాబాద్: యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సీఐ సస్పెండ్!
హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు ఓ యువతిపై అత్యాచారం చేసి, ఆమె భర్తను తుపాకీతో బెదిరించిన సంఘటనలో ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…. హస్తినాపురంలో నివసిస్తున్న బాధితురాలి భర్తను బ్లాక్ మెయిల్ చేస్తూ సీఐ నాగేశ్వరరావు తన పొలంలో పని చేయించుకుంటున్నాడు. భర్త పొలంలో ఉన్న సమయంలో అతని ఇంటికి వచ్చి భార్యను బెదిరించి అనేక సార్లు అత్యాచారం చేశాడు. జూలై 7వ తేదీన సీఐ బాధితురాలిని అత్యాచారం చేస్తున్న సమయంలోనే ఆమె […]
హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు ఓ యువతిపై అత్యాచారం చేసి, ఆమె భర్తను తుపాకీతో బెదిరించిన సంఘటనలో ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే….
హస్తినాపురంలో నివసిస్తున్న బాధితురాలి భర్తను బ్లాక్ మెయిల్ చేస్తూ సీఐ నాగేశ్వరరావు తన పొలంలో పని చేయించుకుంటున్నాడు. భర్త పొలంలో ఉన్న సమయంలో అతని ఇంటికి వచ్చి భార్యను బెదిరించి అనేక సార్లు అత్యాచారం చేశాడు. జూలై 7వ తేదీన సీఐ బాధితురాలిని అత్యాచారం చేస్తున్న సమయంలోనే ఆమె భర్త ఇంటికి వచ్చాడు. దాంతో సీఐ ఆమె భర్తను రివాల్వర్ తో బెదిరించి అర్ధరాత్రి సమయంలో ఇద్దరిని కిడ్నాప్ చేసి కార్లో ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్ళాడు. అయితే కారు మధ్య దారిలో ఆక్సిడెంట్ కు గురయ్యింది. ఆసమయంలో దంపతులిద్దరు తప్పించుకొని వనస్థలీపురం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. పిర్యాదు తీసుకున్న పోలీసులు అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్ చట్టం కింద నాగేశ్వర్ రావుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మరో వైపు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో హుటాహుటిన విచారణ జరిపి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అత్యాచారానికి ఒడిగట్టిన సీఐ నాగేశ్వర్ రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఈ సీఐ పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. బంజారా హిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ పేరును ఎఫ్ ఐ ఆర్ లో చేర్చేందుకు 25 లక్షలు లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.