అన్నదాతలే బీఆర్ఎస్ కు అండ.. టికాయత్ తో కేసీఆర్ మంతనాలు

కేసీఆర్ తర్వలో జాతీయ పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అనే పేరు పెడతారా, లేక మార్పులు చేర్పులు ఉంటాయా అనే విషయం పక్కనపెడితే పార్టీ మాత్రం పక్కా అని తేలిపోయింది. మరి ఈ పార్టీకి వెన్నెముక ఎవరు..? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ భూమికగా మొదలైంది. మరి బీఆర్ఎస్ ప్రధాన అజెండా ఏంటి..? దీనిపై తీవ్ర కసరత్తులు జరిగిన అనంతరం.. అన్నదాతలే అండగా బీఆర్ఎస్ ఆవిర్భావం ఉండాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాగు […]

Advertisement
Update:2022-07-09 02:20 IST

కేసీఆర్ తర్వలో జాతీయ పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అనే పేరు పెడతారా, లేక మార్పులు చేర్పులు ఉంటాయా అనే విషయం పక్కనపెడితే పార్టీ మాత్రం పక్కా అని తేలిపోయింది. మరి ఈ పార్టీకి వెన్నెముక ఎవరు..? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ భూమికగా మొదలైంది. మరి బీఆర్ఎస్ ప్రధాన అజెండా ఏంటి..? దీనిపై తీవ్ర కసరత్తులు జరిగిన అనంతరం.. అన్నదాతలే అండగా బీఆర్ఎస్ ఆవిర్భావం ఉండాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాగు చట్టాల విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంది. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో మాత్రం రైతుబంధు వంటి పథకాలు, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లతో టీఆర్ఎస్ పై అన్నదాతల అభిమానం పెరిగింది. సో.. ఇదే అజెండాతో కేసీఆర్ ముందుకెళ్లాలనుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైతు సంఘాలతో భారీ సభలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో రైతు ఉద్యమాన్ని నడిపించిన రాకేష్ టికాయత్ కి ఈ బాధ్యతలు అప్పగించేలా ఉన్నారు కేసీఆర్. గతంలో చట్టసభలకు పోటీ చేసినా, ప్రస్తుతానికి టికాయత్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన నేతృత్వంలో రైతు సభలు నిర్వహించి.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ రైతు సంక్షేమ పథకాలను హైలెట్ చేయాలనేది కేసీఆర్ ఆలోచన.

కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన, రైతు సదస్సులకు ముందు.. నిజామాబాద్, వరంగల్‌ లో రైతులతో భారీ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండురోజులుగా ప్రగతి భవన్ లో రాకేష్ టికాయత్ తో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. దేశ వ్యాప్తంగా రైతు సదస్సుల నిర్వహణకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. టికాయత్‌ బృందంతో జరిగిన భేటీలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు.

రైతు సదస్సుల అజెండా ఖరారు..
ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ లో, ఆ తర్వాత వరంగల్ లో రైతు సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సదస్సులు మొదలవుతాయి. వీటికి అనువైన ప్రాంతాలు, షెడ్యూల్‌ ను ఈపాటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలను ఆయా సభల్లో వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ.. తెలంగాణ విధానాలను హైలెట్ చేయాలనేది రైతు సదస్సుల అజెండా.

Tags:    
Advertisement

Similar News