కల్లబొల్లి కబుర్లు చెప్పి పోయారు.. మోడీపై హరీష్ రావు ఫైర్
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ సహా బీజేపీ అధినాయకత్వం అంతా హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న మోడీ.. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందే రాష్ట్రానికి వస్తున్న మోడీకి సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఊసే ఎత్తకుండా మోడీ ప్రసంగాన్ని ముగించారు. కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వెల్లడించలేదు. కాగా, దీనిపై మంత్రి హరీష్ […]
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ సహా బీజేపీ అధినాయకత్వం అంతా హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న మోడీ.. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందే రాష్ట్రానికి వస్తున్న మోడీకి సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.
కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఊసే ఎత్తకుండా మోడీ ప్రసంగాన్ని ముగించారు. కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వెల్లడించలేదు. కాగా, దీనిపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశం, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారనుకున్నాను. కానీ కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారని ఆయన విమర్శించారు.
సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు సరికదా.. తమకు జవాబుదారీ తనమే లేదని మరోసారి నిరూపించారన్నారు. తెలంగాణకు మోడీ మరోసారి మెండిచెయ్యి చూపించారు. గుజరాత్‌కు వరాలు కురిపిస్తారు. ఆ రాష్ట్రానికి రూ.763 కోట్ల క్రూడాయిల్ రాయల్టీ, రాజ్‌కోట్‌కు ఎయిమ్స్, బుల్లెట్ ట్రెయిన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా కల్పించారు.
ట్రెడిషనల్ మెడిసిన్‌కు గ్లోబల్ సెంటర్, రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుజరాత్‌కు అందించారు. అలాగే యూపీకి రూ. 55,563 కోట్ల నిధులు, 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కర్నాటకపై కూడా వరాలు కురిపించారు. కానీ తెలంగాణకు ఏమైనా ఇచ్చారా? కేవలం మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికి వచ్చే ప్రకటన చేయలేదని హరీష్ రావు ఆరోపించారు.
ప్రసంగానికి కౌంటర్..
బహిరంగ సభలో మోడీ చేసిన ప్రసంగానికి కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం నుంచి రూ. 1 లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని మోడీ చెప్తున్నారు. కానీ నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం మాత్రం కేంద్రం తీసుకోవడం లేదు. సీఎంఆర్ తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోంది. ఈ బియ్యం విలువ రూ. 22 వేల కోట్లు ఉంటుంది అని హారీష్ అన్నారు. ఇదేనా మీరు రైతులకు అనుకూలంగా చేస్తోంది. మా రైతుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ తీసుకుంటామని ప్రకటిస్తారని ఆశించాం. కానీ మీరు ఆ ఊసే ఎత్తలేదని మంత్రి హరీష్ విమర్శించారు.
మోడీ తన ప్రసంగంలో మహిళలను ఉద్దరిస్తున్నట్లు చెప్పారు. మరి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఇంకా ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి సీఎం కేసీఆర్ తన నిబద్ధత చాటుకున్నామని చెప్పారు.
గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని విజయ సంకల్ప సభ వేదికపై నుంచి కేంద్ర మంత్రులు గర్వంగా ప్రకటించుకున్నారు. బాగానే ఉంది కానీ.. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని శాసన సభలో తీర్మానం చేసి పంపించాం. కానీ కేంద్రం ఇంత వరకు దాన్ని ఆమోదించలేదని గుర్తు చేశారు. సభలో దీనిపై ప్రకటన చేస్తారని అనుకున్నాం. గిరిజన యూనివర్సిటీకి నిధులు, అనమతులు ఇవ్వలేదు. సమ్మక్క సారలక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదు. మా తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడం లేదా అని హరీష్ రావు మోడీని ప్రశ్నించారు.