దేవేంద్ర ఫడ్నవీస్‌ ఔరంగజేబు వంటి క్రూరుడే

ఔరంగజేబు, ఫడ్నవీస్‌ పాలనల ఒకే విధంగా ఉన్నదని మండిపడిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌;

Advertisement
Update:2025-03-17 11:43 IST
దేవేంద్ర ఫడ్నవీస్‌ ఔరంగజేబు వంటి క్రూరుడే
  • whatsapp icon

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మతాన్ని సాధనంగా వినియోగించుకుంటున్నారని, ఆయన ఔరంగజేబు వంటి క్రూరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌ సప్కల్‌ విమర్శించారు. ఔరంగజేబు క్రూరమైన పాలకుడు. అతను తన సొంత తండ్రిని జైల్లో పెట్టాడు. ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌ కూడా అలాంటి క్రూర స్వభావం గలవారే. మతాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వీరిరువురి పరిపాలన ఒకే విధంగా ఉన్నదని హర్షవర్ధన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

ఫడ్నవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ.. కాంగ్రెస్‌ మరింత దిగజారిపోయిందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాంకులే ధ్వజమెత్తారు. ఔరంగజేబుతో ఫడ్నవీస్‌ను పోల్చడం ఆ పార్టీకి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని, పిల్ల చేష్టలను తెలియజేస్తున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజల్లో పార్టీకి ఉన్న కొద్ది మద్దతు కూడా పోతుందని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News