కేంద్రం ఓకే అంటే ముందస్తు ఎన్నికలకు మేం రెడీ : తలసాని

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా అందుకు సిద్దమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను కూడా మహారాష్ట్ర మోడల్‌గా చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. మేం ఎవరికీ భయపడటం లేదని.. వాళ్లు సై అంటే ముందస్తుకు రెడీ అని అన్నారు. దేశ ప్రజలందరూ మోడీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా […]

Advertisement
Update:2022-07-03 02:54 IST

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా అందుకు సిద్దమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను కూడా మహారాష్ట్ర మోడల్‌గా చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. మేం ఎవరికీ భయపడటం లేదని.. వాళ్లు సై అంటే ముందస్తుకు రెడీ అని అన్నారు. దేశ ప్రజలందరూ మోడీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. వాళ్లు ముందస్తు పెట్టినా, జమిలీ ఎన్నికలు పెట్టినా మేం భయపడం. కలిసే ఎన్నికలకు పోదాం. మీరు సై అంటే మేమూ సై, దమ్ముంటే ఎన్నికల్లో మాతో తలపడండి అని తలసాని సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్‌కు టూరిస్టులుగా వచ్చారు. వారిని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడి అభివృద్ధిని చూసి.. వెళ్లి మీ రాష్ట్రంలో కూడా ఇలా చేయండి అని తలసాని సలహా ఇచ్చారు.

తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధానికి స్వాగతం పలకడానికి వచ్చానని అన్నారు. ఇక ఫ్లెక్సీల విషయం జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. అక్రమంగా పెడితే జరిమానాలు తప్పవు. టీఆర్ఎస్ ప్లీనరీ సమయంలో కూడా జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. ఒక మంత్రికి కూడా జరిమానా వేశారని గుర్తు చేశారు. బీజేపీ ఆఫీసు వద్ద కేసీఆర్ పేరుతో డిజిటల్ హోర్డింగ్ పెట్టిన తర్వాతే ‘బై బై మోడీ’ అంటూ ఫ్లెక్సీలు వచ్చాయని తలసాని అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడానికి చేసి ర్యాలీ కేవలం శాంపిల్ మాత్రమేనని.. ముందు మరింత ఉందని తలసాని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News