స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు
Advertisement
భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కాస్త కోలుకున్నాయి. ఉదయం 76,114.42 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత పడిపోయింది. చివరలో కొనుగోళ్ల మద్దతుతో ఊపిరి పీల్చుకొని 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 పాయింట్ల వద్ద ముగిసింది. నిష్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి 86.33 వద్ద ముగిసింది. టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాలు ఆర్జించగా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.
Advertisement