అదరగొట్టిన అభిషేక్‌.. ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం

ఈ విజయంతో 5 టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలోకి భారత్‌

Advertisement
Update:2025-01-22 22:18 IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్‌ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలో టార్గెట్‌ పూర్తి చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ (79) దంచికొట్టాడు. సంజు శాంసస్‌ (26) రాణించాడు. జోఫ్రా 2, అదిల్‌ రషీద్‌ 1 వికెట్‌ పడగొట్టారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 132 రన్స్‌కు ఆలౌట్‌ అయింది. ఈ విజయంతో 5 టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 తో ఆధిక్యంలోకి వెళ్లింది.

మొదట బ్యాటింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 132 రన్స్‌ చేయింది. జోస్‌ బట్లర్‌ (68) ఒక్కడే రాణించాడు. వరుణ్‌ 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2, హార్దిక్‌ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో డకెట్‌ వికెట్‌ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20 ల్లో అత్యధిక వికెట్లు (98) తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్‌ రికార్డు సృష్టించాడు. చాహల్‌ (96 వికెట్లు)ను అధిగమించాడు. 

Tags:    
Advertisement

Similar News