తెలంగాణలో ఇంగ్లిష్ మీడియం సక్సెస్.. భారీగా పెరిగిన అడ్మిషన్లు..

ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన మొదలవుతోంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అనుమానాలు మొదట్లో ఉన్నా.. అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇంగ్లిష్ మీడియం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. గతంలో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఏ జిల్లాలో ఎలా..? తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రభుత్వ […]

Advertisement
Update:2022-06-25 02:44 IST

ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన మొదలవుతోంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అనుమానాలు మొదట్లో ఉన్నా.. అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇంగ్లిష్ మీడియం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. గతంలో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి.

ఏ జిల్లాలో ఎలా..?
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరినవారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది. ఇప్పటి వరకు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,50,826 మంది చేరినట్టు విద్యాశాఖ గణాంకాలు విడుదల చేసింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 14,379 మంది ప్రభుత్వ పాఠశాల్లో కొత్తగా చేరగా.. సిద్ధిపేట‌ జిల్లాలో 6,927 మంది, సంగారెడ్డి జిల్లాలో 9,194 మంది, ఖమ్మం జిల్లాలో 8,810 మంది, భద్రాద్రి జిల్లాలో 8,064 మంది.. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. నెలాఖరునాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ టీచర్ల ప్రచారం..
మరోవైపు ప్రభుత్వ టీచర్లు కూడా ప్రైవేట్ టీచర్స్ లాగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న సౌకర్యాలను ప్రజలకు విడమరచి చెబుతున్నారు. దీని ప్రభావం కూడా అడ్మిషన్లలో కనపడుతోంది. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అందుబాటులో లేక, తప్పనిసరి పరిస్థితుల్లో కాన్వెంట్ చదువులకు పిల్లల్ని పంపించేవారమని, ఇప్పుడు ఆ సమస్యలేదని చెబుతున్నారు తల్లిదండ్రులు. కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల విషయంలో తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం కూడా, సర్కారు స్కూల్స్ లో అడ్మిషన్లు పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది.

పేరు నిలబెట్టుకోవాలి..
ప్రస్తుతం సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు మాత్రమే పెరిగాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం రిజల్ట్ కూడా బాగుండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన సరిగా సాగాలి.. అయితే తొలి ఏడాది ఉపాధ్యాయుల సన్నద్ధత ఎలా ఉంటుందనే అనుమానం కూడా ఉంది. పాఠశాలల్లో మన ఊరు – మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు కూడా నిదానంగా సాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పన మరింత వేగవంతమై.. ఇంగ్లిష్ మీడియం బోధనలో సర్కారు టీచర్లు శెహభాష్ అనిపించుకుంటే మాత్రం ప్రభుత్వ స్కూళ్లకు పూర్తి స్థాయిలో మంచిరోజులు వచ్చినట్టే.

Tags:    
Advertisement

Similar News