వైసీపీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం- ఫృథ్వీరాజ్‌

ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టి ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో పదవి వదులుకున్న నటుడు ఫృథ్వీరాజ్ వైసీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైసీపీ గురించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఒక వ్యక్తి తన బుర్రను పాడు చేశారని, అతడి మాటలు వినే వైసీపీలో చేరానని చెప్పారు. సదరు వ్యక్తి కూర్చోబెట్టుకుని, పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు నూరిపోసినట్టుగా తనకు నూరిపోశారన్నారు. వైసీపీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం లాంటిదన్నారు. ఆ పార్టీలోకి […]

Advertisement
Update:2022-06-25 03:35 IST

ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టి ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో పదవి వదులుకున్న నటుడు ఫృథ్వీరాజ్ వైసీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైసీపీ గురించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఒక వ్యక్తి తన బుర్రను పాడు చేశారని, అతడి మాటలు వినే వైసీపీలో చేరానని చెప్పారు. సదరు వ్యక్తి కూర్చోబెట్టుకుని, పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు నూరిపోసినట్టుగా తనకు నూరిపోశారన్నారు. వైసీపీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం లాంటిదన్నారు.

ఆ పార్టీలోకి కొందరు వ్యక్తులకు కొవ్వు, అహంకారం, మదం అన్ని ఉన్నాయని, తామే అన్నింటిలో టాప్ అన్నట్టుగా వారు మాట్లాడారన్నారు. జగన్‌ను కలిస్తే.. హా.. ఏమ్మా?. ఏంటి? అంటూ అహంకారంగా మాట్లాడారని ఫృథ్వీరాజ్ చెప్పారు. ఇంతబతుకు బతికి ఇలా కాళ్లు మొక్కుతా బాంచన్ అన్నట్టుగా బతకడం ఏంటి అనిపించిందన్నారు. వైసీపీలో ఉన్నంతకాలం తాను ఫృథ్వీరాజ్‌ను కాదని, ఒక ఉగ్రవాదినని, ఒక అపరిచితుడిని అని చెప్పారు. అందుకే అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేశానని.. అలాగైనా జగన్ వద్ద అభిమానం సంపాదించి.. ఎంపీ అయిపోవచ్చు అనే ఆశ అని వివరించారు. వైసీపీలోని వారు కూడా తనను చూసి.. కాబోయే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటూ మాట్లాడేవారని వివరించారు.

9నెలలకు పుట్టాల్సిన బిడ్డను అబార్షన్ చేసి మూడు నెలలకే బయటపడేసినట్టుగా తనను పంపించేశారన్నారు. మహిళ విషయంలో ఏదో చేశానని తనపై చర్యలు తీసుకున్నారని.. మరి మంత్రి అంబటి రాంబాబు అరగంట వస్తావా సుగుణ అని మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీలో కులవివక్ష ఉందని ఫృథ్వీరాజ్‌ విమర్శించారు. 2024లో ఒక మంచి బస్సు ఎక్కి ప్రచారం చేస్తానన్నారు.

Tags:    
Advertisement

Similar News