ఏపీలో గ్రీన్ పవర్.. రైతులకు లీజు బూస్టర్..

ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్టేట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (SIPB) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన SIPB అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత ఇంధన వినియోగంతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు అధికారులు. భూములిచ్చే రైతులకు ఏడాదికి […]

Advertisement
Update:2022-06-23 02:18 IST

ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్టేట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (SIPB) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన SIPB అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత ఇంధన వినియోగంతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు అధికారులు. భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు 30వేల రూపాయల లీజు లభిస్తుందని, అదే సమయంలో ప్రతి 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సగటున ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ 3,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం 90వేల ఎకరాలు రైతులనుంచి సేకరించాల్సి ఉంది. నీటి వసతి లేని భూములు, బీడు భూములనే గ్రీన్ ప్రాజెక్ట్ కోసం సేకరిస్తారని తెలుస్తోంది.

దావోస్ ఒప్పందం ప్రకారం..

ఇటీవల దావోస్‌ లో జరిగిన ఆర్థిక సదస్సులో అదానీ సంస్థతో సీఎం జగన్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాజాగా.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు SIPB ఆమోదం తెలిపింది. మొత్తం నాలుగు దశల్లో నాలుగు చోట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో 1,000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1,200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెద్దకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదితో మొదలయ్యే ప్రాజెక్ట్.. నాలుగు దశల్లో.. అంటే 2026 నాటికి పూర్తవుతుంది. మొత్తంగా 4వేలమందికి ఉపాధి లబించే అవకాశముంది.

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో టెక్స్‌ టైల్‌ పార్క్‌ అభివృద్ధితో పాటు పంక్చుయేట్ గార్మెంట్స్ యూనిట్, మల్లవల్లిలో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్, తిరుపతిలో నోవాటెల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్ కు SIPB ఆమోదం తెలిపింది. ఆయా సంస్థల ఏర్పాటు ద్వారా దాదాపు 20వేలమందికి ఉపాధి లభించే అవకాశముందని SIPB అంచనా వేస్తోంది.

Tags:    
Advertisement

Similar News