రేవ్ పార్టీ లో డ్రగ్స్ వినియోగం…బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు అరెస్ట్

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు నటుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు లోని ఓ హోటల్‌లో రేవ్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. “బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించబడింది. రక్త పరీక్ష నివేదికలో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. అందుకే, అతన్ని ఉల్సూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు,” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ […]

Advertisement
Update:2022-06-13 05:24 IST

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు నటుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు లోని ఓ హోటల్‌లో రేవ్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

“బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించబడింది. రక్త పరీక్ష నివేదికలో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. అందుకే, అతన్ని ఉల్సూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు,” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ భీమశంకర్ ఎస్ గులేద్ విలేకరులతో అన్నారు. .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఎంజీ రోడ్డులోని ఓ పాష్ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా, పోలీసు బృందం ఆ హోటల్ పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుంది.సుమారు 35 మంది నుంచి రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా..? లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవించారా? ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయ్యాయి? తదితర కోణాల్లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News