ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు…ప్రభుత్వం ఉత్తర్వులు

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. జగన్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 2020 నుండి ఈ పీఆర్సీ అమలు కానుంది. మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లలో వారికి మాస్టర్స్‌ స్కేల్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం […]

Advertisement
Update:2022-06-04 01:59 IST

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. జగన్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

జనవరి 2020 నుండి ఈ పీఆర్సీ అమలు కానుంది. మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లలో వారికి మాస్టర్స్‌ స్కేల్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. 23 శాతం ఫిట్‌మెంట్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌) ఎలా నిర్ధారించాలో అందులో పేర్కొంది.

పెన్షన్, గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను ఎలా వర్తింపజేయాలో కూడా సూచించింది.2018 జూలై, 2020 జనవరి మధ్య ఆర్టీసీలో చేరిన ఉద్యోగులకు పే స్కేల్‌ నిర్ధారించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News