రేపు పొత్తులపై పవన్ కళ్యాణ్ తేల్చేస్తాడా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్.. పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరుపనున్నారు. ఇక శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఇందులో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ సీపీనే లక్ష్యంగా పవన్ సభలు, సమావేశాలు ఉంటున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలను ఏకతాటిపైకి […]

Advertisement
Update:2022-06-03 12:34 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్.. పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరుపనున్నారు. ఇక శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఇందులో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ సీపీనే లక్ష్యంగా పవన్ సభలు, సమావేశాలు ఉంటున్నాయి.

2024లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తానని పవన్ మాటలు చెబుతున్నారు. జనసేన కార్యకర్తలకు కూడా ఏ పార్టీతో పొత్తు ఉంటుంది అనే విషయంపై క్లారిటీ లేక అయోమయానికి గురవుతున్నారు. టీడీపీ, బీజేపీలను కలుపుకొని పోవాలని పవన్ మొదటి నుంచి భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కేవలం జనసేనతోనే పొత్తు ఉంటుందని, టీడీపీతో ఉండదని చెబుతూ వస్తున్నది.

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి ఇప్పటికీ రాష్ట్రంలో బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నది. కేవలం జనసేన, బీజేపీ పొత్తు పెట్టకుంటే.. పవన్ ఆశించిన లక్ష్యం నెరవేరదు. టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి మధ్య ఓట్లు చీలడం ఖాయం. అదే జరిగితే అంతిమంగా వైసీపీకే లాభం చేకూరనున్నది. అందుకే పవన్ మూడు పార్టీలను ఏకం చేయాలని.. అవసరం అయితే కమ్యూనిస్టు పార్టీలను కూడా వెంటబెట్టుకోవాలని ఆశిస్తున్నారు.

శనివారం జరుగనున్న పార్టీ సమావేశంలో కార్యకర్తలకు ఈ విషయంపై పవన్ స్పష్టత ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రాబోయే ఎన్నికల సన్నాహాలపై కూడా చర్చించనున్నారు. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇవ్వాలా లేదా అనే విషయంపై కూడా పవన్ కార్యకర్తలతో చర్చించనున్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News