త్వరలోనే నూతన రూ.100, రూ.200 నోట్లు రిలీజ్

రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.;

Advertisement
Update:2025-03-11 21:19 IST

ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ప్రకటించింది. మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. నోట్లు అందుబాటులోకి వచ్చినా పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. శక్తికాంత దాస్ పదవీ విరమణ చేసిన అనంతరం సంజయ్ మల్హొత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం సంజయ్ మల్హొత్రా 26వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన 3 సంవత్సరాల పదవీ కాలానికి RBI గవర్నర్ గా నియమితులయ్యారు. గతంలో రిజర్వ్ బ్యాంకు కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది. పాత రూ.1000 నోట్లను నిలిపివేసిన విషయం విధితమే. మరోవైపు త్వరలో రూ.50నోట్లు కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News