ప్రణయ్ కేసు తీర్పుపై.. అమృత సంచలన ట్వీట్

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించడంపై షాకింగ్ ట్వీట్ చేసింది.;

Advertisement
Update:2025-03-11 19:37 IST

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించడంపై అతని భార్య అమృత స్పందించింది. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నా. ఈ ప్రయాణంలో మద్దతునిచ్చిన పోలీసుశాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. నాబిడ్డ భవిష్యత్తు కోసం నేను మీడియా సమావేశం నిర్వహించట్లేదు, మమ్మల్ని అర్థం చేసుకోగలరని అని అమృత పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. నిందితుల్లో ప్రధానమైన మారుతి రావు మరణించగా, A2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించబడింది. మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిన అనంతరం నల్గొండ జిల్లా పోలీసులు వారిని భారీ భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు.

తీర్పు అనంతరం నిందితులు తమ శిక్షను తగ్గించమని కోర్టును వేడుకున్నారు. ఈ కేసు విషయమై హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో అన్ని కోణాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక పరువు హత్యే అయినా.. కాంట్రాక్ట్ కిల్లర్లతో మర్డర్ చేపించటంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ వివరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉందని.. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదంటూ బుకాయించాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దర్యాప్తు ప్రారంభించిన 3 రోజుల్లోనే కేసును ఛేదించినట్టు ఆనాటి సంగతులను రందనాథ్ తెలిపారు. కోర్టు వెలువరించిన తీర్పుతో తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News