లోయలో పడిన బీఎస్‌ఎఫ్‌ ట్రక్కు.. ముగ్గురు జవాన్లు వీరమరణం

మణిపుర్‌లోని సేనాపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది;

Advertisement
Update:2025-03-11 21:34 IST

మణిపుర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్ల ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13 మందికి గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో కొంత మంది జవాన్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో అమరవీరుల పార్థివ దేహాలను వారి ఇంటికి తరలించేందుకు భారత సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సైనికుల ఇళ్లు, గ్రామాల్లో శోకసంద్రం నెలకొంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News