సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నటుడు మోహన్‌బాబు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సినీ నటులు మోహన్‌బాబు, విష్ణు మర్యాద పూర్వకంగా కలిశారు.;

Advertisement
Update:2025-03-11 22:05 IST

సీఎం రేవంత్‌రెడ్డిని నటులు మోహన్‌బాబు, విష్ణు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని తండ్రీకొడుకులు శాలువాతో సత్కరించారు. సంబంధిత ఫొటోలను నటుడు, ‘మా’ అధ్యక్షుడు విష్ణు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యమైన పలు అంశాలపై చర్చించాం. రాష్ట్రంతోపాటు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, వీటి పట్ల సీఎంకు ఉన్న నిబద్ధతకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News