మస్క్‌ 'స్టార్‌లింక్‌'తో ఒప్పందం

ఈ మేరకు స్టార్‌లింక్‌, జియో ఒప్పందంపై ప్రకటన విడుదలైంది.;

Advertisement
Update:2025-03-12 09:41 IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో జియో జట్టు కట్టింది. దీంతో మరింత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లో జియో అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ మేరకు స్టార్‌లింక్‌, జియో ఒప్పందంపై ప్రకటన విడుదలైంది. భారత్‌లో అనుమతులు పొందాక స్టార్‌లింక్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

ఈ ఒప్పందం గురించి జియో నుంచి ప్రకటన వెలువడింది. అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ అందేలా చేసేందుకు ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు. జియో బ్రాడ్‌ బ్యాండ్‌ వ్యవస్థతో స్టార్‌లింక్ ను అనుసంధానించడం ద్వారా మా పరిధిని మరింత విస్తరించనున్నాం. ఈ ఒప్పందం ఏఐ ఆధారిత యుగంలో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విశ్వసనీయతను పెంచనున్నదని పేర్కొన్నది. జియో తన రిటైల్‌ ఔట్‌లెట్లు, ఆన్‌లైన్‌ వేదికగా స్టార్‌ లింక్‌ సేవలు అందుబాటులోకి తేనున్నది. ఆ రెండు కంపెనీలు పరస్పరం తమ ప్రయోజనాలను అందిపుచ్చుకొని ముందుకుసాగనున్నాయని తన ప్రకటనలో పేర్కొన్నది. 

Tags:    
Advertisement

Similar News