అమ్మఒడి రద్దు చేసినట్లు తప్పుడు పోస్టులు.. అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడి అరెస్ట్

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. గత నెలలో ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై మే 30న సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కాగా, ఇలా పోస్టు పెట్టిన వ్యక్తి అప్పిని వెంకటేశ్‌గా గుర్తించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా, టెక్కలి […]

Advertisement
Update:2022-06-03 03:41 IST

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. గత నెలలో ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై మే 30న సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

కాగా, ఇలా పోస్టు పెట్టిన వ్యక్తి అప్పిని వెంకటేశ్‌గా గుర్తించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా, టెక్కలి ఐటీడీపీ కోఆర్డినేటర్‌గా అతడు పని చేస్తున్నాడు. అతడే ఈ పోస్టులను విస్తృతంగా షేర్ చేసినట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.

గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడిని పోలీసులు విచారించారు. తనకు వచ్చిన పోస్టులనే తాను షేర్ చేశానని, తాను మాత్రం వాటిని క్రియేట్ చేయలేదని అతడు పోలీసులకు వివరించాడు. కాగా, అదే సమయంలో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి వచ్చి హంగామా చేశారు. సోషల్ మీడియా పోస్టులకు వెంకటేశ్‌ను పిలిపించి విచారించడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్‌ను విడిచిపెట్టారు. కానీ శుక్రవారం విచారణకు హాజరవ్వాలని అతడికి నోటీసు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News