న్యాయవ్యవస్థపై దాడి చేసేవారికి ఎన్‌.వీ రమణ సూచన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వీ రమణ హెచ్చరికతో కూడిన సూచన చేశారు. న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్న వారికి ఆయన గట్టి సూచన చేశారు. న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేని కొందరు మిత్రులకు తాను ఈ సూచన చేస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ అనేది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థ కాదన్నారు సీజేఐ. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిబద్దతతో రాజ్యాంగబద్దంగానే న్యాయవ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం సులువుగా […]

Advertisement
Update:2022-06-02 14:35 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వీ రమణ హెచ్చరికతో కూడిన సూచన చేశారు. న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్న వారికి ఆయన గట్టి సూచన చేశారు. న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేని కొందరు మిత్రులకు తాను ఈ సూచన చేస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ అనేది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థ కాదన్నారు సీజేఐ. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిబద్దతతో రాజ్యాంగబద్దంగానే న్యాయవ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం సులువుగా మారిందన్నారు.

వ్యవస్థల ద్వారా స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోలేని వారు.. కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతున్నారని సీజే వ్యాఖ్యానించారు. అలా చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇది దురదృష్టకర పరిణామం అన్నారు. పరిధిలు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు ప్రతి ఒక్కరూ మిత్రులేనని.. పరిధి దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్దమవుతుందన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు కలిగాయన్నారు. గత ఎనిమిదేళ్ల అనుభవం ఆ సందేహాలను పటాపంచలు చేసిందన్నారు. సంక్షేమ పాలన అందించడం రాజ్యాంగం అప్పగించిన బాధ్యత అని సీజేఐ వ్యాఖ్యానించారు. పేదలకు ఆర్థిక సాయం చేయడం పాలనలో భాగమన్నారు. అదే తరహాలో అవసరం ఉన్న వారికి న్యాయాన్నిఅందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కొత్తగా 32 జిల్లా కోర్టులను సీఎం కేసీఆర్‌తో కలిసి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ALSO READ : సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Tags:    
Advertisement

Similar News