ఒక్క మే నెలలో రూ. 9500 కోట్ల అప్పు

ఏపీ ప్రభుత్వం ఒక్క మే నెలలో 9500 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఈ ఏడాది 61వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత విజ్ఞప్తి చేసింది. కేంద్రం మాత్రం 28వేల కోట్ల రూపాయల అప్పుకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అంటే నెలకు 2వేల500 రూపాయల చొప్పున అప్పు తెచ్చుకుంటే కేంద్రం నిర్దేశించిన పరిమితి సరిపోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఒక్క మే నెలలోనే 9500 కోట్ల రూపాయలు అప్పు […]

Advertisement
Update:2022-05-31 01:56 IST

ఏపీ ప్రభుత్వం ఒక్క మే నెలలో 9500 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఈ ఏడాది 61వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత విజ్ఞప్తి చేసింది. కేంద్రం మాత్రం 28వేల కోట్ల రూపాయల అప్పుకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అంటే నెలకు 2వేల500 రూపాయల చొప్పున అప్పు తెచ్చుకుంటే కేంద్రం నిర్దేశించిన పరిమితి సరిపోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఒక్క మే నెలలోనే 9500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంది.

ఏప్రిల్‌, మే రెండు నెలలు కలిపితే రూ. 13వేల 890 కోట్లు ఆర్‌బీఐ వద్ద బాండ్ల వేలం ద్వారా రాష్ట్రం అప్పు తెచ్చుకుంది. ఒకే నెలలో 9500 కోట్ల రూపాయల అప్పు తేవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఒక నెలలో 5వేల కోట్ల రూపాయల అప్పును గరిష్టంగా తెచ్చారు. రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 78 శాతానికి చేరిపోయింది. ఇది 20 శాతం మించకూడదని కేంద్రం నిబంధనలు పెట్టింది.

అయినప్పటికీ ఏపీకి అప్పు తీసుకునే విషయంలో కేంద్రం తన వంతు సహకారం అందిస్తోంది. అదే తెలంగాణకు వచ్చే సరికి మాత్రం అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. ఈ ఆర్థిక ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఒకసారి కూడా ఆర్‌బీఐ వద్ద బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇవ్వలేదు. కేవలం తమకు రాజకీయంగా అనుకూలంగా ఉన్న వారికే అప్పుల విషయంలోనూ వెసులుబాటును కేంద్రం ఇస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ అప్పు.. పెండింగ్‌ బిల్లులతో కలుపుకుని రూ . 7.88 లక్షల కోట్లకు చేరింది. ఒక్క మే నెలలోనే 9500 కోట్లు అప్పు తేగా.. రాష్ట్రానికి సంబంధించిన పన్ను, పన్నేతర ఆదాయం నెలకు సరాసరి 8500 కోట్లు మాత్రమే ఉంది. అంటే వస్తున్న ఆదాయం కంటే చేసిన అప్పే మే నెలలో అధికంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News