బాబూ.. పెట్రోధరలపై ఎవరిని అడుగుతున్నావు? " మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరీ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ యాత్ర కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. అధికారంలో లేననే అక్కసుతో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. […]

Advertisement
Update:2022-05-29 14:19 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరీ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ యాత్ర కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. అధికారంలో లేననే అక్కసుతో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు.. పెట్రో, డీజిల్ ధరలు ఎవరు నియంత్రించగలరో తెలియదా? అని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు పెరగలేదా? అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలపై కేంద్రాన్ని విమర్శించే దమ్ములేని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

మహానాడులో ప్రసంగించిన మాజీ మంత్రుల మీద కూడా బొత్స ఫైర్ అయ్యారు. ‘గతంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది మహానాడులో నొటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు వాళ్లకు కనీస సంస్కారం ఉందా? ముఖ్యమంత్రి కుటుంబసభ్యులపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఇటువంటి వాళ్లను ఏమనాలి’ అంటూ బొత్స మండిపడ్డారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని.. నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాలేమన్న ఫ్రస్టేషన్ తో చంద్రబాబు నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News