సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్.. ఏపీకి రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా జరిపిన ఈ పర్యటన సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దావోస్ సదస్సుకు వచ్చిన ప్రముఖ కంపెనీల యజమానులు, ప్రతనిధులతో సీఎం జగన్ జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదర్చుకొని రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీ అదానీ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా జరిపిన ఈ పర్యటన సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దావోస్ సదస్సుకు వచ్చిన ప్రముఖ కంపెనీల యజమానులు, ప్రతనిధులతో సీఎం జగన్ జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదర్చుకొని రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీ అదానీ గ్రూప్‌తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆ కంపెనీ అధినేత అదానీతో జరిపిన చర్చలు దావోస్‌లో కీలకంగా మారాయి. అదానీతో పాటు గ్రీన్ కో, అరబిందో ఫార్మా వంటి కంపెనీలతో ఏపీ ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నది.
దావోస్ పర్యటనలో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలే ఎక్కువగా జరిగాయి. 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రానికి రాబోతున్నది. గ్రీన్‌కో కంపెనీతో కలసి ప్రపంచంలోనే తొలి సారి గ్రీన్ ఎనర్జీపై తాము పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ ప్రకటించింది. ఆ కంపెనీ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో కలసి సీఎం జగన్ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన చేశారు. గ్రీన్ ఎనర్జీతో పాటు స్టీల్, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్, ప్యాకేజింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో 76.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ పెట్టనున్నది.
కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ ముందుకు రావడంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో చొరవ చూపిన సీఎం జగన్‌ను ఆయన అభినందించారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకొని పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ఒక సెజ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నది. మచిలీపట్నం సమీపంలో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా రానున్న నాలుగు సీపోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణపై కూడా సీఎం జగన్ దృష్టి సారించారు. దస్సాల్ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ సంస్థలతో చర్చలు జరిపారు. సముద్ర రవాణాకు ఏపీ అనుకూలంగా ఉండటంతో ఇక్కడి పోర్టుల నుంచి రవాణాను ప్రస్తుతం ఉన్న దానికంటే మూడు రెట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. కాకినాడ పోర్టు నుంచి మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఈవో తకిషి హషిమొటో ప్రకటించారు.