హైదరాబాద్ రోడ్లపై జర జాగ్రత్త.. జూన్ 1 నుంచి అలా హారన్ కొడితే కేసులే

హైదరాబాద్ రోడ్లపై వాహనాలు నడపటం అంటే పెద్ద సవాలుతో కూడుకున్నదే. ఉదయం నుంచి రాత్రి వరకు భారీ ట్రాఫిక్ కారణంగా వాహనం బయటకు తీయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీనికి తోడు గంటల తరబడి రోడ్లపై వాహనాల రణగొణ ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. మరోవైపు కొంత మంది అదే పనిగా హారన్లు మోగిస్తూ విసుగుతెప్పిస్తుంటారు. రోడ్లపై వెళ్లే తోటి వాహనదారులకు మాత్రమే కాకుండా, రోడ్ల వెంట ఉండే ఇండ్లలో వారికి కూడా ఈ హారన్ల మోత పెద్ద నరకమే. […]

Advertisement
Update:2022-05-22 06:15 IST

హైదరాబాద్ రోడ్లపై వాహనాలు నడపటం అంటే పెద్ద సవాలుతో కూడుకున్నదే. ఉదయం నుంచి రాత్రి వరకు భారీ ట్రాఫిక్ కారణంగా వాహనం బయటకు తీయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీనికి తోడు గంటల తరబడి రోడ్లపై వాహనాల రణగొణ ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. మరోవైపు కొంత మంది అదే పనిగా హారన్లు మోగిస్తూ విసుగుతెప్పిస్తుంటారు. రోడ్లపై వెళ్లే తోటి వాహనదారులకు మాత్రమే కాకుండా, రోడ్ల వెంట ఉండే ఇండ్లలో వారికి కూడా ఈ హారన్ల మోత పెద్ద నరకమే. మరి కొంత మంది బైకర్లు చిత్రవిచిత్రమైన హారన్లతో భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటి వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయబోతున్నారు.

నగరంలో నానాటికీ పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి సిటీ పోలీసులు నడుం భిగించారు. జూన్ 1 నుంచి నిర్దేశించిన డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దంతో హారన్ మోగిస్తే కేసులు నమోదు చేయనున్నారు. అంతే కాకుండా చిత్రవిచిత్రమైన ధ్వనులో కూడిన హారన్లు, ఎయిర్ హారన్లు మోగించే వారిపై కూడా పూర్తి సాక్ష్యాలతో కేసులు పెట్టనున్నారు. గత కొన్ని వారాలుగా సిటీలో పైలెట్ ప్రాజెక్టు కింద స్పెషల్ కెమేరాలతో ఇలాంటి హారన్లు కొట్టే వారిని గుర్తించారు. ఏప్రిల్ 10 నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 3,320 వాహనాలకు అమర్చిన నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహన యజమానులకు ఎంవీ యాక్ట్ 190(2) సెక్షన్ కింద రూ. 1,000 జరిమానా విధించారు. కానీ ఇకపై ఇలాంటి వారిపై జరిమానాలే కాకుండా కేసులు కూడా బుక్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటికే నగరంలో అకౌస్టిక్ కెమేరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై పదేపదే హారన్లు కొట్టే వారిని ఈ కెమేరాలు పట్టేస్తాయి. హారన్ ఏ వైపు నుంచి వస్తే అటువైపు కెమేరాలు తిరుగుతాయి. ఆ వాహనం ఫొటో తీయడమే కాకుండా మూడు సెకెన్ల వీడియోను కూడా తీసి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తాయి. అక్కడ పోలీసులు మరోసారి పరిశీలించి సదరు వాహనదారుడిపై తగిన చర్యలు తీసుకోనున్నారు.

ALSO READ: 1200 పెండింగ్ పీహెచ్‌డీలను రద్దు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ

Tags:    
Advertisement

Similar News