ధాన్యం తడిచినా పర్లేదు.. చివరి గింజ వరకు కొనే బాధ్యత కూడా మాదే -కేసీఆర్..
అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోతోందని రైతులు బాధపడవద్దను.. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్ఫష్టం చేశారు సీఎం కేసీఆర్. వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా బాయిల్డ్ రైస్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై […]
అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోతోందని రైతులు బాధపడవద్దను.. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్ఫష్టం చేశారు సీఎం కేసీఆర్. వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా బాయిల్డ్ రైస్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటివరకు 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమాన్ని ఈనెల 20 నుంచి నిర్వహించాల్సి ఉండగా అది జూన్ 3కి వాయిదా పడింది. 15రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ చాలా ధ్వంసమైందని, విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నామని చెప్పారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిసారి 10 గ్రామాలు తెలంగాణనుంచే ఎంపికయ్యాయని చెప్పారు. రెండో సారి ప్రకటించిన జాబితాలో మొదటి 20 స్థానాల్లో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయని గుర్తు చేశారు. దేశం గర్వించే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని అన్నారు కేసీఆర్.
గ్రామీణ క్రీడా ప్రాంగణాలు..
తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 24 వేల ‘గ్రామీణ క్రీడా కమిటీ’లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలు నిర్వహించేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయని, జూన్ 2న కొన్ని గ్రామాల్లో అయినాక్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.