గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్‌, వెంటనే వేటు

గంజాయి రవాణా కేసులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి అరెస్ట్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు కావడంతో టీడీపీ నేతలు ఆచితూచి ఉన్నారు. 2013 నాటి కేసు ఇది. హైదరాబాద్‌లో ఉంటున్న జాహ్నవి.. తన కారు డ్రైవర్‌తో పాటు విశాఖకు చెందిన మరో వ్యక్తి ద్వారా మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయి స్మగ్లింగ్ చేసే వారు. 2013లో ఒకసారి వారి కారును దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. 42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. […]

Advertisement
Update:2022-05-16 02:37 IST

గంజాయి రవాణా కేసులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి అరెస్ట్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు కావడంతో టీడీపీ నేతలు ఆచితూచి ఉన్నారు. 2013 నాటి కేసు ఇది. హైదరాబాద్‌లో ఉంటున్న జాహ్నవి.. తన కారు డ్రైవర్‌తో పాటు విశాఖకు చెందిన మరో వ్యక్తి ద్వారా మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయి స్మగ్లింగ్ చేసే వారు. 2013లో ఒకసారి వారి కారును దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. 42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆ సమయంలో జాహ్నవి పరార్ అయ్యారు. డ్రైవర్ సురేష్‌ రెడ్డి మాత్రమే దొరికాడు. ఎల్బీ నగర్‌ కోర్టులో ఆమెపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎట్టకేలకు ఆమెను తెలంగాణ పోలీసులు నరసరావుపేటలో ఆదివారం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 2013లో గంజాయి కేసు ఉన్నప్పటికీ ఆమె టీడీపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

జాహ్నవిని అరెస్ట్‌ చేసింది తెలంగాణ పోలీసులు కావడంతో ఆమె అమాయకురాలు అంటూ వాదించే ప్రయత్నం ఈసారి టీడీపీ చేయలేదు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ బచ్చుల అర్జుణుడు ప్రకటించారు. కేసులో తుదితీర్పు వచ్చే వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు.

జాహ్నవి అరెస్ట్ అయిన తర్వాత.. ఆమెతో తమ పార్టీకి సంబంధాలు స్వల్పమే అన్న భావన కలిగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జాహ్నవి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీలోనే ఉందని.. 2019 ఎన్నికల తర్వాతనే ఆమె టీడీపీలోకి చేరారని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ చెబుతున్నారు. పదేళ్ల క్రితం కేసులో ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే.. దీని వెనుక టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే కుట్ర కూడా ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News