వివాహిత మహిళలపై లైంగిక హింసలో 83 శాతం మంది నేరస్తులు భర్తలే " NFHS సంచలన రిపోర్ట్

  భార్యకు ఇష్టం లేకుండా భర్త తనతో లైంగిక వాంచలు తీర్చుకుంటే అది అత్యాచారమా కాదా అనే విషయంపై ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల బెంచ్ విభిన్నమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS విడుదల చేసిన రిపోర్ట్ చర్చనీయాంశమైంది. ఢిల్లీ హైకోర్టు లో ఇద్దరు జడ్జిల్లో ఒకరు అది అత్యాచారమని తీర్పునివ్వగా మరో జడ్జి దాన్ని అత్యాచారమనలేమని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు రానుంది. […]

Advertisement
Update:2022-05-14 15:23 IST

 

భార్యకు ఇష్టం లేకుండా భర్త తనతో లైంగిక వాంచలు తీర్చుకుంటే అది అత్యాచారమా కాదా అనే విషయంపై ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల బెంచ్ విభిన్నమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS విడుదల చేసిన రిపోర్ట్ చర్చనీయాంశమైంది. ఢిల్లీ హైకోర్టు లో ఇద్దరు జడ్జిల్లో ఒకరు అది అత్యాచారమని తీర్పునివ్వగా మరో జడ్జి దాన్ని అత్యాచారమనలేమని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS విడుదల చేసిన రిపోర్ట్ సంచలన విషయాలను తెలిపింది.

NFHS సర్వే (2019-21) ప్రకారం 18-49 సంవత్సరాల వయస్సు గల వివాహిత స్త్రీలలో 83 శాతం మంది తమ భర్తలనుండే లైంగిక హింసలు ఎదుర్కొన్నారు. 13 శాతం మంది మాజీ భర్తలనుండి ఈ హింసలను ఎదుర్కొన్నారు.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే కోసం ఇంటర్వ్యూ చేసిన 18 మరియు 49 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో ఆరు శాతం మంది తమ జీవితకాలంలో అనేక సార్లు లైంగిక హింసను అనుభవించినట్లు చెప్పారు.

4,169 మంది వివాహం చేసుకున్నమహిళలు తమ పై జరిగిన లైంగిక హింస లో 82 శాతం మంది నేరస్థులు తమ భర్తలేనని చెప్పారు. వారిలో 84 శాతం మంది తమ భర్తలు తమను రేప్ చేశారని చెప్పారు.

తమ భర్తల ద్వారా లైంగిక హింసకు గురైన స్త్రీలు కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 10.3 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8.1, లడఖ్ 7.7 ఉన్నాయి. అదే సమయంలో, వారి భాగస్వాముల నుండి శారీరక, లైంగిక హింసను భరించిన ఈ స్త్రీలలో ఎక్కువ భాగం కనీసం బైటికి చెప్పుకోలేదు.

“భారతదేశంలో శారీరక, లైంగిక హింసను ఎదుర్కొన్న మహిళలందరిలో, కేవలం 14 శాతం మంది మాత్రమే ఇతరుల సహాయం కోరారు. 77 శాతం మంది స్త్రీలు ఎప్పుడూ ఎవ్వరినీ ఎటువంటి సహాయం కోరలేదు. పైగా తాము అనుభవించిన హింస గురించి ఎవరికీ చెప్పలేదు” అని సర్వే పేర్కొంది. సహాయం కోరిన వారిలో కూడా దాదాపు 60 శాతం మంది తమ స్వంత కుటుంబాలను ఆశ్రయించారు.

ఈ విధమైన భర్తల లైంగిక హింసలో సంపద, విద్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని సర్వే వెల్లడించింది. ఉదాహరణకు, ఐదేళ్లలోపే చదువు ఆపేసిన‌ వివాహిత మహిళల్లో 7.2 శాతం మంది జీవిత భాగస్వాముల నుండి లైంగిక హింసను ఎదుర్కొన్నారు.

అయితే, 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్న మహిళల్లో ఇది కేవలం 2.9 శాతం మాత్రమే. అలాగే, పేదలు, దిగువ మద్యతరగతికి చెందిన వివాహిత మహిళల్లో 10.2 శాతం మంది భర్తల నుండి లైంగిక హింసను ఎదుర్కొంటుండగా, ధనవంతులలో అది 3.1 శాతం మాత్రమే.

ప్రభుత్వ లెక్కలే ఇంత దారుణాలను బైటపెడుతుండగా ఇంకా…ఇప్పటికీ మనం భార్య ఇష్టం లేకుండా భర్త లైంగిక వాంఛ తీర్చుకోవడాన్ని అత్యాచారం అనొచ్చా లేదా అనే విషయంపై చర్చలకే పరిమితమవుతుండటం విషాదం.

Tags:    
Advertisement

Similar News