గడప గడపకు కార్యక్రమానికి టీడీపీ అడ్డంకులు..
రాష్ట్రంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. లబ్ధిదారులకు జరిగిన ఆర్థిక సాయాన్ని వారికి వివరిస్తున్నారు. ఏ కుటుంబానికి ఎంతమొత్తం లబ్ధి చేకూరిందన్న విషయాన్ని వివరించి చెబుతూ.. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఆరా తీస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల అధికార పార్టీ నేతలను జనాలు అడ్డుకుంటున్నారని, తరిమి కొడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఇలాంటి వార్తలొస్తున్నాయి. అయితే ఇదంతా టీడీపీ చేస్తున్న […]
రాష్ట్రంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. లబ్ధిదారులకు జరిగిన ఆర్థిక సాయాన్ని వారికి వివరిస్తున్నారు. ఏ కుటుంబానికి ఎంతమొత్తం లబ్ధి చేకూరిందన్న విషయాన్ని వివరించి చెబుతూ.. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఆరా తీస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల అధికార పార్టీ నేతలను జనాలు అడ్డుకుంటున్నారని, తరిమి కొడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఇలాంటి వార్తలొస్తున్నాయి. అయితే ఇదంతా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం అంటూ కొట్టిపారేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కావాలనే కొంతమంది టీడీపీ సానుభూతి పరులు గడప గడపకు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, నిలదీసినట్టు మాట్లాడుతున్నారని, వారంతా సామాన్య ప్రజల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అని మండిపడ్డారు అనిల్.
మేమూ తిట్టించగలం..
టీడీపీ నాయకులు కూడా జనాల్లోకి వస్తున్నారని, కావాలంటే వారిని కూడా తాము తిట్టించగలమని చెప్పారు అనిల్. తమకు కూడా అనుచరులున్నారని, టీడీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ అమ్మలక్కలు తిట్టించగలమని హెచ్చరించారు. గడప గడపకు కార్యక్రమంపై బురదజల్లాలనుకోవడం అవివేకం అని అన్నారు అనిల్.
మా ఫొటోలు లేకపోతే మీకు రేటింగ్స్ రావు..
తన ఫొటో, కొడాలి నాని ఫొటోలు లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి రేటింగ్స్ రావని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. తమపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తనపై ఏమి రాసుకుంటారో మీడియాలో ఏం చూపించుకుంటారో చూపించుకోండని అన్నారు అనిల్. తాము ఏమిరాసినా ఏమి చూపించినా చెల్లుబాటవుతుందనుకుంటే కడుపు మండిన అభిమానులు ఏదో ఒకరోజు తగిన బుద్ధి చెబుతారని అనిల్ హెచ్చరించారు. చెత్త పన్నును చంద్రబాబే ప్రతిపాదించారని, దాన్ని ఇంకా తగ్గించే ఆలోచన చేస్తున్నామని అన్నారు.