'దళితులు మా భూముల్లో అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, 5 వేల జరిమానా' !
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తావాల్ ప్రాంతంలోని పావతి ఖుర్ద్ గ్రామంలో వేసిన ఓ దండోరా కుల దురహంకారానికి, అగ్రకుల ఆధిపత్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఆ దండోరా వీడియో వైరల్ అయ్యాక దానిపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది. పావతి ఖుర్ద్ గ్రామ మాజీ ప్రధాన్ రాజ్‌వీర్ కు చెందిన పొలాలు, ఆయన కుటుంబ సమాధులు, ఆయన బోరు బావులు, ఆయన ఇల్లు తదితర అనేక ప్రాంతాల్లోకి దళితులు అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, 5 […]
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తావాల్ ప్రాంతంలోని పావతి ఖుర్ద్ గ్రామంలో వేసిన ఓ దండోరా కుల దురహంకారానికి, అగ్రకుల ఆధిపత్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఆ దండోరా వీడియో వైరల్ అయ్యాక దానిపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది.
పావతి ఖుర్ద్ గ్రామ మాజీ ప్రధాన్ రాజ్‌వీర్ కు చెందిన పొలాలు, ఆయన కుటుంబ సమాధులు, ఆయన బోరు బావులు, ఆయన ఇల్లు తదితర అనేక ప్రాంతాల్లోకి దళితులు అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, 5 వేల జరిమానావిధిస్తామని ఆ గ్రామంలో దండోరా వేశారు. సోమవారం నాడు ఈ సంఘటన జరగగా మంగళవారం నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర విమర్శలకు కారణమైంది.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో మేల్కొన్న పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి మాజీ ప్రధాన్ రాజ్‌వీర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముజఫర్‌నగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అభిషేక్ యాదవ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నం తదితర కేసులు నమోదు చేశారు.
కాగా, ఈ గ్రామ మాజీ ప్రధాన్ రాజ్‌వీర్ గ్యాంగ్‌స్టర్ విక్కీ త్యాగికి తండ్రి. ఈ విక్కీ త్యాగిని 2015 ఫిబ్రవరిలో ముజఫర్‌నగర్‌లోని కోర్టు హాలులో ప్రత్య్రర్థులు కాల్చి చంపారు.
ఇదిలావుండగా, ఈ ఘటనను శోషిత్ క్రాంతి దళ్ అనే సామాజిక సంస్థ అధ్యక్షుడు రవికాంత్ ఖండిస్తూ, ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై వివక్షే కాకుండా దాడులు, అణిచివేత తీవ్రతరమవుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.