వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. మేం కరెంట్, నీళ్లు కట్ చేస్తాం..

కంటోన్మెంట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కంటోన్మెంట్ అధికారులను విమర్శించారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. తాము క‌రెంట్, నీళ్లు బంద్ చేస్తామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న నాలాల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడారు కేటీఆర్. స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కంటోన్మెంట్ లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడం సరికాదన్నారు. […]

Advertisement
Update:2022-03-12 12:51 IST

కంటోన్మెంట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కంటోన్మెంట్ అధికారులను విమర్శించారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. తాము క‌రెంట్, నీళ్లు బంద్ చేస్తామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న నాలాల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడారు కేటీఆర్. స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కంటోన్మెంట్ లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడం సరికాదన్నారు. దాని వల్ల నదీం కాలనీ మునిగిపోతోందని వివరించారు.

తెలంగాణ వేరే దేశం అన్న‌ట్టు కేంద్రం విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. హైద‌రాబాద్‌ లో ఉంటున్న‌ప్పుడు కంటోన్మెంట్ కూడా క‌లిసిమెలిసి ఉండాలని, అలా కాదని ఇష్ట‌మొచ్చిన‌ట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు క‌డతామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్ర‌జ‌ల కోసం ఎంత‌కైనా తెగిస్తామన్నారు కేటీఆర్. కంటోన్మెంట్ అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే పిలిచి మాట్లాడాల‌ని స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీని ఆదేశిస్తామ‌ని తెలిపారు కేటీఆర్. ఒక వేళ వారు విన‌క‌పోతే తీవ్ర‌మైన చ‌ర్య‌ల‌కు, క‌ఠిన చ‌ర్య‌ల‌కు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున శాస‌న‌స‌భ‌లో చెప్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పైసా సాయం చేయ‌రు కానీ, ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వానికి అవ‌రోధం క‌లిగించ‌డం స‌రికాద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

గుజరాత్ కి వెయ్యి కోట్లు.. తెలంగాణకు మొండిచేయి..
హైదరాబాద్‌ లో గతేడాది వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కేంద్ర పెద్దలు చాలా మంది వరద ప్రాంతాలను సందర్శించి ఆ తర్వాత పట్టించుకోలేదని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు పైసా సాయం చేయలేదని, గుజరాత్‌ కు మాత్రం వరద సాయం వెయ్యి కోట్లు ప్రకటించారని విమర్శించారు. హైదరాబాద్‌ కు సాయం అడిగితే కేంద్రం లోని పెద్దలు అమృత్‌ పథకంలో చేరమని చెప్పారని, ఆ పథకంలో చేరినా కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News