ముమ్మాటికీ వికేంద్రీకరణే మా విధానం " మంత్రి బొత్స

అమరావతిపై హైకోర్టు తీర్పు అనంతరం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. ముమ్మాటికీ అభివృద్ధి వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ విధానం అని చెప్పారాయన. ప్రతిపక్షాల అభిప్రాయాలు తమకు ప్రామాణికం కాదని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు బొత్స. ఏపీకి రాజధానికోసం నియమించిన శివరామకృష్ణ కమిషన్‌ కూడా వికేంద్రీకరణకే మొగ్గు చూపిందని పేర్కొన్నారు. హోదా, పోలవరం తాకట్టు పెట్టారు.. చంద్రబాబు తన […]

Advertisement
Update:2022-03-05 13:44 IST

అమరావతిపై హైకోర్టు తీర్పు అనంతరం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. ముమ్మాటికీ అభివృద్ధి వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ విధానం అని చెప్పారాయన. ప్రతిపక్షాల అభిప్రాయాలు తమకు ప్రామాణికం కాదని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు బొత్స. ఏపీకి రాజధానికోసం నియమించిన శివరామకృష్ణ కమిషన్‌ కూడా వికేంద్రీకరణకే మొగ్గు చూపిందని పేర్కొన్నారు.

హోదా, పోలవరం తాకట్టు పెట్టారు..
చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పోలవరం ప్రాజెక్ట్ ని, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు మంత్రి బొత్స. ప్రాజెక్ట్ అంచనా విలువను, కాంపెన్సేషన్ ను తగ్గించడం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. వికేంద్రీకరణ కోసం ఏం చేయాలో అది చేస్తామని బొత్స స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనపై వచ్చిన విజ్ఞప్తులను కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వికేంద్రీకరణ బిల్లుని తిరిగి ప్రవేశ పెడతారా అనే ప్రశ్నకు మాత్రం వేచి చూడండని సమాధానమిచ్చారు.

అసెంబ్లీ హక్కులపై చర్చించాలి..
మరోవైపు ఈనెల 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలే అత్యంత ప్రాధాన్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరవ్వాలన్నారు. వివేకా హత్యపై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై కూడా తాము అసెంబ్లీ లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన. అసెంబ్లీ అధికారాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చిస్తామని చెప్పారు. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్లు చెప్పారు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News