మోదీ హైదరాబాద్ పర్యటనతో రాజకీయ దుమారం..

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణకు వచ్చిన ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకలేదు. ఆయన కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. దీంతో బీజేపీ నేతలు సహజంగానే కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. కావాలనే కేసీఆర్, మోదీ కార్యక్రమానికి రాలేదని ఆరోపించారు. “షేమ్ ఆన్ యు కేసీఆర్” అనే పేరుతో బీజేపీ నేతలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ యుద్ధం మొదలు పెట్టారు. […]

Advertisement
Update:2022-02-06 04:33 IST

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణకు వచ్చిన ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకలేదు. ఆయన కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. దీంతో బీజేపీ నేతలు సహజంగానే కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. కావాలనే కేసీఆర్, మోదీ కార్యక్రమానికి రాలేదని ఆరోపించారు. “షేమ్ ఆన్ యు కేసీఆర్” అనే పేరుతో బీజేపీ నేతలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ యుద్ధం మొదలు పెట్టారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ నేతలు కూడా మరో హ్యాష్ ట్యాగ్ ని పాపులర్ చేశారు. “ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ” అంటూ.. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

అంతా అనుకున్నట్టుగానే..
ఇటీవల బీజేపీ అధినాయకత్వంపై కేసీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కేంద్ర బడ్జెట్ పై కూడా ఆయన తన స్టైల్ లో సెటైర్లు పేల్చారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రాజెక్టులకు జాతీయ హోదా, యూనివర్శిటీల మంజూరు, విభజన హామీలు, నిధులు.. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరు కారు అనే ప్రచారం జోరుగా సాగింది. చివరి నిముషంలో కేసీఆర్, ప్రధానికి స్వాగతం పలికేందుకు వస్తారని కూడా అన్నారు. కానీ చివరకు ఆ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆయనకు జ్వరంగా ఉందని, అందుకే ప్రధాని పర్యటనలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు. కానీ బీజేపీ మాత్రం వదిలిపెట్టలేదు. మోదీకి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రాకుండా డమ్మీ నేతను పంపారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. మోదీని చూడగానే కేసీఆర్‌ కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.

మొత్తమ్మీద బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన ప్రతిసారీ రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ఆమధ్య పశ్చిమబెంగాల్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన మోదీకి చేదు అనుభవం ఎదురైంది, సీఎం మమతా బెనర్జీ మోదీని లైట్ తీసుకున్నారు. ఇటీవల పంజాబ్ పర్యటనలో కూడా నిరసనకారుల వల్ల ప్రధాని కాన్వాయ్ రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి. తాజాగా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం పలికేందుకు రాలేదు. కేసీఆర్ ఓ వ్యూహం ప్రకారమే మోదీ పర్యటనకు హాజరు కాలేదనేది బీజేపీ వాదన. దీన్ని నేరుగా తిప్పికొట్టకుండా.. బడ్జెట్ లో తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News