భారత్ లో పెరిగిపోతున్న బల్లకింద చేతులు.. లంచాల మేతలో మనమే మేటి..

ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే, ఏ బిల్లు మంజూరు కావాలన్నా ఆమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే. చిన్నదా, పెద్దదా అనే తేడా లేదు, ఏదయినా, దాని విలువ ఎంతయినా.. ఇంత పర్సంటేజీ ఇవ్వాలనేది ఇప్పుడు సహజ న్యాయసూత్రంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు మరోసారి తీసింది. బ్రైబరి ఇండెక్స్ లో 82వ స్థానానికి చేర్చింది. అంతర్జాతీయంగా లంచాల మేత ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి..? ఏ దేశంలో అసలు లంచం అనే ప్రస్తావన […]

Advertisement
Update:2021-11-18 04:15 IST

ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే, ఏ బిల్లు మంజూరు కావాలన్నా ఆమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే. చిన్నదా, పెద్దదా అనే తేడా లేదు, ఏదయినా, దాని విలువ ఎంతయినా.. ఇంత పర్సంటేజీ ఇవ్వాలనేది ఇప్పుడు సహజ న్యాయసూత్రంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు మరోసారి తీసింది. బ్రైబరి ఇండెక్స్ లో 82వ స్థానానికి చేర్చింది.

అంతర్జాతీయంగా లంచాల మేత ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి..? ఏ దేశంలో అసలు లంచం అనే ప్రస్తావన లేకుండా పని జరుగుతుంది.. అనే విషయాలపై ప్రతి ఏటా ట్రేస్ అనే సంస్థ అధ్యయనం చేస్తుంది. తాజాగా 194 దేశాల్లో ఈ అధ్యయనం జరిపింది. లంచాల సమస్యలేని దేశాల జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉండటం అత్యంత విచారకరమైన విషయం. అసలు లంచం అవసరమే లేకుండా అత్యంత పారదర్శకతతో పనులు జరిగే దేశంగా డెన్మార్క్ తొలిస్థానంలో నిలిచింది. పెద్ద లంచగొండి దేశంగా ఉత్తరకొరియా 194వ స్థానంలో ఉండటం విశేషం.

పొరుగు దేశాలకంటే దారుణంగా..
అభివృద్ధిలో పొరుగు దేశాలతో పోల్చుకుంటూ చంకలు గుద్దుకోవడం మన నేతలకు అలవాటే. అయితే అదే సమయంలో పొరుగు దేశాలతో పోల్చి చూస్తే భారత్ లోనే లంచగొండులు ఎక్కువగా ఉన్నారనేది అసలు సత్యం. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా మనకంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయి. అంటే మన దేశం కంటే అక్కడ లంచాల వ్యవహారం తక్కువ అన్నమాట.

ఇక అమెరికా, ఉజ్బెకిస్తాన్, మలేసియా, అంగోలాలో గత ఐదేళ్లలో లంచాల వ్యవహారం బాగా ముదిరిపోయిందని, ఆయా దేశాల్లో లంచాలు లేనిదే పనులు జరగడంలేదని బ్రైబరీ ఇండెక్స్ చెబుతోంది. అవినీతి నిరోధక విభాగం పనితీరు, కంపెనీల అనుమతులకు లభించే సమయం, అనుమతుల విషయంలో పారదర్శకత, లంచం ఇవ్వడంపట్ల పౌరుల్లో ఉన్న ఆసక్తి, మీడియా పాత్ర.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ బ్రైబరీ ఇండెక్స్ తయారు చేస్తారు. గతేడాది 77వ ర్యాంకులో ఉన్న భారత్, ఈ ఏడాది 82వ ర్యాంక్ కి పడిపోవడం ఇక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కడుతోంది.

Tags:    
Advertisement

Similar News