చంద్రబాబుకు షాక్.. కుప్పం మున్సిపాలిటీ వైసీపీ వశం..!
మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ శ్రేణులు షాక్ లో మునిగాయి. ఈ నెల 15వ తేదీన కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఏకంగా 19 వార్డుల్లో వైసీపీ జయకేతనం ఎగుర వేయగా, టీడీపీ కేవలం ఆరు వార్డుల్లో మాత్రమే […]
మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ శ్రేణులు షాక్ లో మునిగాయి. ఈ నెల 15వ తేదీన కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఏకంగా 19 వార్డుల్లో వైసీపీ జయకేతనం ఎగుర వేయగా, టీడీపీ కేవలం ఆరు వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. కుప్పంలో ఎలాగైనా గెలవాలని వైసీపీ తొలినుంచి సన్నాహాలు చేసుకుంటూ రాగా చివరకు అనుకున్నది సాధించింది. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగాయి.
రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా ఓటర్ల కు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కుప్పంలో ఓటమిపై నారా లోకేష్ స్పందన
కుప్పం తో పాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు ‘ దొంగ ఓట్లు, వందల కోట్లు, గుండాగిరీ, అధికారులు, పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని, ప్రజలు లోకేష్ రెండు చెంపలు పగలగొట్టారని వైసీపీ నేతలు శునకానందంలో ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్ కు వ్యతిరేకంగా ఓటు వేసి, జగన్ బట్టలూడదీసి వాయగొట్టారనేది.. బులుగు బుర్రలకు ఎప్పుడెక్కుతుందో’ అని లోకేష్ ట్వీట్ చేశారు.