నవంబర్ 17నుంచి అసెంబ్లీ.. కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం..

ఏపీ కేబినెట్ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయానికి అవకాశం కల్పిస్తూ సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. దేవాదాయ శాఖ స్థలాలు, దుకాణాల లీజు విషయంలో కూడా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. రైతులకు 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనిట్‌ కు రూ.2.49 చొప్పున ఏడాదికి […]

Advertisement
Update:2021-10-28 12:33 IST

ఏపీ కేబినెట్ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయానికి అవకాశం కల్పిస్తూ సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. దేవాదాయ శాఖ స్థలాలు, దుకాణాల లీజు విషయంలో కూడా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. రైతులకు 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనిట్‌ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసేందుకు, కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీల ఏర్పాటుకి కూడా కేబినెట్ సమ్మతించింది.

కొత్తగా 1,285 ఉద్యాగాల భర్తీకి మంత్రివర్గం అంగీకరించింది. అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్ట్ పోస్ట్ లు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి ఆమోదం లభించింది. విశాఖలో తాజ్‌ వరుణ్‌ బీచ్‌ ప్రాజెక్టుతోపాటు.. రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపుకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపుకి జగన్ టీమ్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేపు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌ లకు ఆమోదం లభించింది.

అమ్మఒడికి హాజరు తప్పనిసరి..
అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై విస్తృతంగా ప్రచారం జరపాలని నిర్ణయించింది. గతేడాది కొవిడ్ కారణంగా హాజరుకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మావోయిస్టులు, అనుబంధ సంస్థలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆయన చెప్పారు. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదని, ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక నవంబర్ 17నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News