కాంగ్రెస్ సభ్యులైనంత మాత్రాన మద్యానికి దూరంగా ఉండాలా..?
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం నవంబర్ 1నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో సభ్యత్వంకోసం స్వీకరించే దరఖాస్తులో ఈ ఏడాది చిన్న మార్పు చేయబోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకునేవారెవరైనా మద్యం జోలికి వెళ్లం, ఖద్దరునే ధరిస్తాం అని సంతకం చేయాల్సి ఉంటుంది. సదరు సభ్యత్వ దరఖాస్తుల వ్యవహారం నామమాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రెండు నిబంధనలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై కాంగ్రెస్ తాజా సమావేశంలో తీవ్ర […]
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం నవంబర్ 1నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో సభ్యత్వంకోసం స్వీకరించే దరఖాస్తులో ఈ ఏడాది చిన్న మార్పు చేయబోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకునేవారెవరైనా మద్యం జోలికి వెళ్లం, ఖద్దరునే ధరిస్తాం అని సంతకం చేయాల్సి ఉంటుంది. సదరు సభ్యత్వ దరఖాస్తుల వ్యవహారం నామమాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రెండు నిబంధనలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై కాంగ్రెస్ తాజా సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది.
సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ ల సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. మద్యపానం అనేది ఈ రోజుల్లో చాలా సహజంగా మారిందని కొందరు కీలక నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. దీంతో రాహుల్ గాంధీ, మద్యం తాగేవారెవరు అని ప్రశ్నించగా అక్కడే ఉన్న కొందరు నేతలు తమ చేతులు పైకెత్తారు. మరికొందరు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సీనియర్లు సైతం అడపా దడపా మద్యపానం జోలికి వెళ్తామని చెబుతున్న తరుణంలో ఇక ప్రాథమిక సభ్యత్వంలో ఆ నిబంధన ఉండటం అనవసరం అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది నుంచి స్వీకరించే దరఖాస్తుల్లో మద్యపానం చేయము అనే నిబంధనను తొలగించబోతున్నారు. అదే సమయంలో ఖద్దరు ధరిస్తాము అనే నిబంధన కూడా మార్చాలనే చర్చ జరిగింది. ప్రస్తుతం ఖద్దరు ఖరీదు చాలా ఎక్కువైందని సామాన్య కార్యకర్తలు ఖద్దరు ధరించడం కుదరని పని అని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి నేతలు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది.
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఈ పాత నిబంధనలపై క్లారిటీ ఇచ్చారు. ఖద్దరు ధరించడం, మద్యపాన సేవనకు దూరంగా ఉండటం అనే నిబంధనలు బాగా పాతవి అని, దశాబ్దాలుగా కాంగ్రెస్ సభ్యత్వ దరఖాస్తులో మార్పులు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం కొత్త దరఖాస్తు ఫారంలను తయారు చేస్తున్నామని, పాత నిబంధనలు మారుస్తున్నామని స్పష్టం చేశారు.