స్వీయ నిషేధం విధించుకుంటానంటున్న నాని

టక్ జగదీష్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ఎగ్జిబిటర్లు ఓ రేంజ్ లో ఆందోళన చేశారు. ఒక దశలో నాని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటాం అంటూ సంచలన ప్రకటన చేశారు కూడా. ఇప్పుడు దానికి ప్రతిగా నాని కూడా సంచలన ప్రకటన చేశాడు. మరోసారి తన సినిమా ఓటీటీలోకి వస్తే, ఈసారి తనకు తానే బ్యాన్ విధించుకుంటానని ప్రకటించి సంచలనం సృష్టించాడు నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగా లేక టక్ జగదీష్ సినిమాను ఓటీటీకి […]

Advertisement
Update:2021-09-01 15:14 IST

టక్ జగదీష్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ఎగ్జిబిటర్లు ఓ రేంజ్ లో ఆందోళన చేశారు. ఒక దశలో నాని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటాం అంటూ సంచలన ప్రకటన చేశారు కూడా. ఇప్పుడు దానికి ప్రతిగా నాని కూడా సంచలన ప్రకటన చేశాడు. మరోసారి తన సినిమా ఓటీటీలోకి వస్తే, ఈసారి తనకు తానే బ్యాన్ విధించుకుంటానని ప్రకటించి సంచలనం సృష్టించాడు నాని.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగా లేక టక్ జగదీష్ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాల్సి వచ్చిందని, రాబోయే
రోజుల్లో పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత కూడా తన సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ కు వెళ్తే.. అప్పుడు ఎవరో వచ్చి తనను బ్యాన్ చేయనక్కర్లేదని, అలాంటి రోజు వస్తే తనకుతానే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ విధించుకుంటానని ప్రకటించాడు నాని.

ఎగ్డిబిటర్లు తన సినిమాను అడ్డుకుంటానని అన్నప్పుడు తనకు కోపం రాలేదని, ఎందుకంటే వాళ్ల బాధను
తను అర్థం చేసుకున్నానని అన్నాడు నాని. తను ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోలేదని,
ఎగ్జిబిటర్లలో తను కూడా ఒకడినని, అలాంటి తనను వేరు చేసి మాట్లాడినప్పుడు బాధగా అనిపించిందన్నాడు నాని.

Tags:    
Advertisement

Similar News