అందరూ సంయమనం పాటించాలి
సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు అల్లు అర్జున్ సూచన
తమ ఇంటిపై జరిగిన దాడి జరిగిన నేపథ్యంలో తొందరపడి ఎవరూ ఎలాంటి చర్యలకు దిగవద్దని అల్లు అర్వింద్ కోరారు. తమ ఇంటి ముందు ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్నారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. విద్యార్థి సంఘాల నేతలు అల్లు అర్జున్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఇంటిపై రాళ్లు రువ్వారు. అక్కడ పూల కుండీలు ధ్వంసమయ్యాయి.
అలాంటి వారికి దూరంగా ఉండండి: అల్లు అర్జున్
మరోవైపు సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు. ఈ మేరకు లేక విడుదల చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించేపరిచే విధంగా పోస్టుపెట్టొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్నిరోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు సూచిస్తున్నా అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ బాధ్యతగాయుతంగా వ్యవహరించాలని కోరారు.