రేవతి కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం
శ్రీ తేజ్ కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్ధిక సహాయం అందజేశారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప-2 సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్ధిక సహాయం అందజేశారు. మృతురాలు రేవతి భర్త భాస్కర్‌కు నిర్మాత నవీన్ ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలను అందించింది. అలాగే అనంతరం పుష్ప 2 నిర్మాతలు మాట్లాడుతూ.. రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఆ కుటుంబానికి తీరని లోటు. అయితే మేము శ్రీ తేజ్ ను చూడటానికి ఇకడైకి వచ్చాము. ప్రస్తుతం ఆ బాబు రికవరీ అవుతున్నాడు అని వారు పేర్కొన్నారు. అయితే గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రలో ఈ సంధ్య థియేటర్ ఘటనే పెద్ద ఎత్తున చర్చలో ఉన్న సంగతి తెలిసిందే.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను ‘పుష్పా 2’ నిర్మాత నవీన్‌తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు.రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని.. దేవుడు దయవల్ల అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుంది అనే దానిపై కూడా మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీ ఎక్కడికి పోదు. మద్రాసు కంటే ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్. ఇక్కడి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచస్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ చేసుకుంటున్నాయి. మీరు తరలిపోతున్నాయా అని అడుగుతున్నారు. సోషల్ మీడియా ఇలాంటివే ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి అన్నారు.