మోహన్ బాబుకు భారీ షాక్..త్వరలో అరెస్ట్ ?

తెలంగాణ హైకోర్టులో ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది.

Advertisement
Update:2024-12-23 15:44 IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను మరోసారి కోర్టు కోట్టేసింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మందస్తు బెయిల్‌ను కోరారు. మోహన్‌బాబుకు గుండె, నరాల సమస్యలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన దేశంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. మోహన్‌బాబు ఎక్కడకి వెళ్లలేదని.. మనుమరాలు పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నట్లుగా న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, మోహన్‌బాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని ఏపీపీ కోరారు.

ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మోహన్‌బాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దిగువ కోర్టును ఆశ్రయించాలని మోహన్‌బాబుకు కోర్టు సూచించింది. ఇటీవల హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఆయనకు, పెద్ద కొడుకు విష్ణు, మనోజ్‌ గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడికి న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్‌బాబు దాడి చేశారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. త్వరలో మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News