అల్లు అర్జున్ ఇంటి గేట్లకు తెల్లటి పరదాలతో మూసివేత

అల్లు అర్జున్ నివాసం చుట్టూ అన్నీ పరదాలను ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2024-12-24 14:41 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ నివాసం చుట్టూ అన్నీ పరదాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇటీవలే జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని సామాగ్రిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద తెల్లటి పరదాలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంటి గేటును మూసివేశారు. ఇంటి లోపలి మనుషులు ఎవరూ బయట మీడియాకు కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ ని ఇటీవలే అరెస్ట్ చేయడం.. చంచల్ గూడ జైలుకు తీసుకువెల్లడం.. వెంటనే హైకోర్టు బెయిల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇవాళ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లి విచారించారు. దాదాపు 2గంటల 40 నిమిషాల పాటు విచారణ చేశారు. 

Tags:    
Advertisement

Similar News