మంచు కుటుంబంలో మళ్లీ మంటలు

విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2024-12-23 20:53 IST

మంచు ఫ్యామిలీలో మళ్లీ రచ్చ మొదలైంది. మంచు మనోజ్‌ తన అన్న మంచు విష్ణుపై వినయ్ అనే వ్యక్తిపైనా పహాడీషరీఫ్‌ పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. ఇటీవల హైదరాబాద్ జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు వర్గం, మనోజ్ వర్గం పోటాపోటీగా బౌన్సర్లను రంగంలోకి దింపడంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో, తన ఇంటిలోకి వచ్చిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది.

జర్నలిస్టులపై దాడితో మోహన్ బాబుపై కేసు నమోదైంది. అటు, ఉద్రిక్తతలకు దారి తీసే ఎలాంటి చర్యలకు పాల్పవడవద్దంటూ మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలోనే మళ్లీ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడదన్న విషయం అర్థమవుతోంది..ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్‌లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్‌ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్‌ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News