చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బన్నీ
హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణ నిమిత్తం చిక్కడపల్లిపోలీస్ స్టేషన్‌కు చేరుకున్నరు
Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసుల విచారణ నిమిత్తం బయల్ధేరారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11 గా ఉన్న బన్నీనీ పోలీసులు ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ వాంగూల్మాన్ని పోలీసులు రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, బన్నీమామ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు. స్టేషన్ రూట్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు అలులోకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ స్టేషన్ కు వస్తే ఆయనను చూసేందుకు, మద్దతు తెలిపేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలు పెట్టినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
Advertisement