టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారు
థియేటర్లలో ఏ సినిమా అయినా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలన్న తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తెలంగాణ ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. టికెట్ ధరలు పెంచచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎగ్జిబిటర్లు కోరారు.
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఇటీవల పరిణామాలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీలోనే సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. బాలుడు శ్రీతేజ్‌ను ఆదుకోవడానికి సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..టికెట్ ధరలు, బెనిఫిట్‌షోలపై సీఎం నిర్ణయాన్ని స్వాగితిస్తున్నామని ఎగ్జిబిటర్ల సంఘం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ సినిమాకైనా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలన్నారు.
మరోవైపు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీని కలవడానికి వెళ్లినట్లు సమాచారం. తాజా పరిణామాలను ఆమెకు వివరించనున్నట్లు తెలుస్తోంది.