పారదర్శకత అంటే పారిపోతున్నారు.. బంగారు వ్యాపారుల్లో హాల్ మార్క్ దడ..

బంగారం అమ్మకాలు కొనుగోళ్లలో పాదర్శకతకోసం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ ని తప్పనిసరి చేసింది. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు అమలవుతున్నాయి. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ కి పిలుపునిచ్చారు. అసలు హాల్ మార్క్ తో షాపు యజమానులకు వచ్చిన సమస్య ఏంటి..? అమ్మకాల్లో పారదర్శకతకోసం ప్రభుత్వం కృషిచేస్తుంటే దాన్ని ఎందుకు వద్దంటున్నారు..? ఎందుకీ హాల్ […]

Advertisement
Update:2021-08-22 09:08 IST

బంగారం అమ్మకాలు కొనుగోళ్లలో పాదర్శకతకోసం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ ని తప్పనిసరి చేసింది. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు అమలవుతున్నాయి. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ కి పిలుపునిచ్చారు. అసలు హాల్ మార్క్ తో షాపు యజమానులకు వచ్చిన సమస్య ఏంటి..? అమ్మకాల్లో పారదర్శకతకోసం ప్రభుత్వం కృషిచేస్తుంటే దాన్ని ఎందుకు వద్దంటున్నారు..?

ఎందుకీ హాల్ మార్క్..?
ప్రస్తుతం బంగారం అమ్మకం, కొనుగోలు ఎక్కువశాతం ప్రభుత్వ లెక్కల్లోకి రావడంలేదు, పేరున్న కంపెనీలు మాత్రమే ప్రతి నగకీ జీఎస్టీ సహా బిల్లుని ఇస్తాయి. హాల్ మార్క్ నగలని మాత్రమే అమ్ముతాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో చిన్న చిన్న పట్టణాల్లో కూడా హాల్ మార్క్ నగలనే బంగారు షాపులవారు అమ్మాల్సి వస్తోంది. అయితే ఇక్కడే చిన్న మతలబు ఉంది. నగలపై హాల్ మార్క్ ఉంటుంది కానీ, ఆ హాల్ మార్క్ కి, ఆ నగలు అమ్మే షాపుకి సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి షాపుకి హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటోంది. ప్రతి బంగారు ఆభరణానికి హాల్ మార్క్ ఉండాల్సిందేనని రూల్ పెట్టింది. దీంతో పరోక్షంగా వినియోగదారుడికి నాణ్యమైన బంగారం లభ్యమవుతుంది. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. బ్లాక్ మనీని బంగారం రూపంలో దాచి పెట్టేవారికి ఇదో పెద్ద షాక్. జీఎస్టీ బిల్లులు లేకుండా బంగారం అమ్మేవారికి కూడా ఇది ఇబ్బందికర పరిణామమే.

హాల్ మార్క్ వద్దంటూ గగ్గోలు..
ఇప్పటి వరకూ హాల్ మార్క్ లేకుండా, జీఎస్టీ బిల్లులు లేకుండా బంగారం అమ్మకాలు జోరుగా సాగాయి. వీటి వల్ల ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ అంతా వ్యాపారస్తులు మిగుల్చుకున్నారు. బ్లాక్ మనీతో బంగారం కొనాలనుకునేవారికి కూడా చిన్న చిన్న షాపులు ఉన్న వారే దిక్కయ్యేవారు. బిల్లులు లేకుండా, హాల్ మార్క్ లేకపోయినా వీరంతా బంగారం కొని దాచిపెట్టుకునేవారు. ప్రభుత్వం ఇప్పుడు హాల్ మార్క్ తప్పనిసరి చేయడంతో ఈ దందా ఇకపై సాగే అవకాశం లేదు. కస్టమర్లను మోసం చేసే ఛాన్సే లేదు, ట్యాక్స్ లు ఎగ్గొట్టే మార్గం మూసుకుపోయినట్టే. అందుకే హాల్ మార్క్ వద్దు, మా వ్యాపారాలు దెబ్బతీయొద్దంటూ షాపు ఓనర్లు ఆందోళనకు దిగుతున్నారు. చిన్న చిన్న వ్యాపారుల నష్టపోతారంటూ వితండవాదం చేస్తున్నారు. లాభాలు మాత్రం కావాలి, ప్రభుత్వానికి లెక్క చెప్పమంటే మాత్రం కుదరదంటున్నారు.

షాపు యజమానులు వద్దంటున్నా.. హాల్ మార్క్ నిబంధన తప్పనిసరి చేస్తున్నట్టు స్పష్టం చేశారు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారి. దాదాపు అన్ని అసోసియేషన్లు కొత్త విధానాన్ని ఆహ్వానిస్తున్నాయని… కొన్ని సంస్థలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రకస్తే లేదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News