కౌశిక్‌కు ఎమ్మెల్సీ.. అసలు కేసీఆర్ వ్యూహమేంటి?
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో .. అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు గట్టి పోటీఇచ్చారు. అయితే ఇటీవల కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే కౌశిక్‌రెడ్డిని పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఈటల రాజేందర్ మీద అవినీతి […]
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో .. అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు గట్టి పోటీఇచ్చారు. అయితే ఇటీవల కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే కౌశిక్‌రెడ్డిని పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది.
ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి బయటకు పంపించడంతో.. తెలంగాణ సమాజం నుంచి సానుభూతి దక్కింది. అన్ని పార్టీల వారు తొలుత ఈటలకు అండగా నిలబడ్డారు. సీఎం కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే.. ఈటలను పక్కకు పెట్టారన్న వాదన బలంగా తెరమీదకు వచ్చింది. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాటంగానే ఈటలకు మద్దతు తెలిపారు.
కానీ అదే టైంలో .. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి.. ఈటలపై విమర్శలకు దిగారు. ఆయన అవినీతి పరుడే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓ దశలో టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువ కౌశిక్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నాడన్న అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇక రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కూడా కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో యాక్టివ్గానే ఉన్నారు. కానీ అంతలోనే ఆయన టీఆర్ఎస్లో చేరారు.
కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్లో చేరబోయేముందు కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందంటూ కౌశిక్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఆడియో బయటకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద చర్యలు తీసుకొనే లోపే కౌశిక్ టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. దీంతో కౌశిక్‌కు హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని అంతా భావించారు.
కౌశిక్‌రెడ్డి కూడా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కానీ ఆయనకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఎన్ఆర్ఐ బరిలో దిగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేదంటే బీసీ నేతలు ఎల్ రమణ, వకుళాభరణం కృష్ణ మోహన్‌కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ మీద బలమైన నేతను బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ఇందుకోసమే సుధీర్ఘ సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్టు టాక్. అయితే కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే ఆయనకు మంచి భవిష్యత్ ఉండేదని.. ఇవాళ కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా ఆయన గెలిచేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది.