టీటీడీపీ కొత్త బాస్​ ఎవరు? బాబు కసరత్తు..!

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​. రమణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వెళ్లిపోవడంతో టీడీపీ ఖాళీ అయిపోతుందని అంతా భావించారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్​రెడ్డి, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్​ గౌడ్​ తదితరులు హాజరయ్యారు. రమణ టీఆర్​ఎస్​లో చేరిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ.. త్వరలో టీటీడీపీ టీఆర్​ఎస్​లో విలీనం చేసేందుకు […]

Advertisement
Update:2021-07-10 15:01 IST

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​. రమణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వెళ్లిపోవడంతో టీడీపీ ఖాళీ అయిపోతుందని అంతా భావించారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్​రెడ్డి, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్​ గౌడ్​ తదితరులు హాజరయ్యారు. రమణ టీఆర్​ఎస్​లో చేరిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ.. త్వరలో టీటీడీపీ టీఆర్​ఎస్​లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు.

దీంతో చంద్రబాబు అలర్ట్​ అయినట్టు సమాచారం. అర్జెంట్​గా ఓ అధ్యక్షుడిని నియమించాలని ఆయన భావిస్తున్నారట. మరోవైపు పార్టీ సారథి అయ్యేందుకు నర్సిరెడ్డి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఆయన మంచి మాటకారి. పలు సమావేశాల్లో ఆయన ఉపన్యాసాలు టీడీపీ శ్రేణులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయనకు మంచి క్రేజ్​ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం బీసీ నేతను పార్టీ అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్నారని సమాచారం.

ఇక ఈ సమావేశానికి కొందరు నాయకులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. అక్కడక్కడా కొందరు కార్యకర్తలు, వృద్ధ నాయకులు ఉన్నారు. దీంతో ఎవరినో ఒకరిని సారథిగా నియమించి.. పార్టీ ఉనికి ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.

Tags:    
Advertisement

Similar News